Wednesday, February 22, 2012

వన్ మేన్ షో పూల రంగడు


పూల రంగడు విజయంతో సునీల్ తో ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నాడు కమిడియెన్ సునీల్ నుంచి సిక్స్ ప్యాక్ తో యాక్షన్ హీరోగా మారిన సునీల్ తన రెమ్యునేషన్ ని మూడు కోట్లకు పెంచినట్లు సమాచారం. గతంలో రోజుకు పది నుంచి పదిహేను లక్షలు వసూలు చేసిన సునీల్ తన రెమ్యునేషన్ పెంచి ఫిక్స్ చేసినట్లు చెప్తున్నారు. ఎందుకంటే అతను ఇప్పుడు హిట్ లో ఉన్న హాట్ హీరో అని యాక్షన్ హీరోలకు తగ్గని విధంగా చేసిన ఫైట్స్డాన్స్ లు మాస్ ని ఊపేస్తున్నాయి . సినిమాలో కామెడీ కన్నా ఇవే ఎక్కువ పేలాయి. దాంతో ఆ రేంజి రెమ్యునేషన్ ని పెంచటం సమంజసమేనని టాలీవుడ్ వర్గాలు అంటున్నవి . ఇక మీడియా మొత్తం పూల రంగడు చిత్రాన్ని సినిమా అంతా సునీల్ చేసిన �వన్ మేన్ షో� అంటున్నారు. దాంతో రాత్రికి రాత్రే సునీల్‌ని స్టార్ హీరోని చేసేసిందీ సినిమా. దర్శకుడు వీరభద్రంచౌదరి సైతం సునీల్‌పైనే ఎక్కువగా శ్రద్ధ వహించి డిజైన్ చేసి హిట్ కొట్టాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో సిక్స్ ప్యాక్ తో సునీల్ చేసిన ఫైట్ సినిమాకే హైలైట్ కావటం ప్లస్ అయ్యింది. దాంతో మూడు సంవత్సరాలు సునీల్ శ్రమ ఇలా వర్కవుట్ అయ్యి అతన్ని మూడు కోట్ల హీరోని చేసింది.

No comments: