Sunday, August 23, 2015

వామ్మో.. ఒక్క సెక్స్ వీడియో కు 65 కోట్లా?

పోర్న్ ఇండస్ట్రీ గురించి అప్పుడప్పుడూ ఆసక్తికరమైన వార్తలు వస్తుంటాయి. పోర్న్ సినిమాల్లో నటించేవారికి విపరీతమైన డిమాండ్ ఉంటుందని.. భారీగా ఆదాయం ఆర్జిస్తారని మనం అనుకుంటాం కానీ.. ఈ మధ్య జరిగిన అధ్యయనం ప్రకారం ఈ రంగంలో విపరీతమైన పోటీ ఉందని.. అందరికీ అవకాశాలుండవని.. పారితోషకాలు కూడా తక్కువే అని తేలింది. చాలామంది లక్షల్లో మాత్రమే పారితోషకాలు తీసుకుని పోర్న్ సినిమాలు చేస్తుంటారని వెల్లడైంది. ఐతే అందరి విషయాల్లోనూ ఇలాగే ఉండదు. కొందరికి విపరీతమైన డిమాండ్ కూడా ఉంటుంది. ఓ హాట్ బ్యూటీ సెక్స్ వీడియోకు ఏకంగా రూ.65 కోట్ల పారితోషకం ఆఫర్ చేశారంటే నమ్మగలరా? ఇంతకీ ఎవరా బ్యూటీ.. ఏమా కథ.. తెలుసుకుందాం పదండి.

అమెరికా రియాల్టీ టీవీ స్టార్ కైలీ జెనర్ కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. 18 ఏళ్లకే సూపర్ పాపులారిటీ సంపాదించిందీ హాట్ లేడీ. ఓసారి గూగుల్ లో ఈ పేరు కొట్టి చూస్తే ఆమె ఎంత హాటో అర్థమవుతుంది. ఈ అమ్మాయికి వివిడ్ ఎంటర్ టైన్మెంట్ అనే సంస్థ ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. తన బాయ్ ఫ్రెండ్ టైగా తో కలిసి సెక్స్ చేసి ఆ వీడియో టేపు తమకిస్తే కోటి డాలర్లు అంటే మన కరెన్సీ లో రూ.65 కోట్లు ఇస్తామని ప్రకటించింది. కైలీకి ఇలాంటి ఆఫర్ రావడం కొత్తేమీ కాదు. ఇంతకుముందే ఓ సంస్థ ఆమె సెక్స్ వీడియో కోసం రూ.10 కోట్ల ఆఫర్ ఇచ్చింది. కానీ కైలీ ఒప్పుకోలేదు. ఐతే ఇప్పుడు ఆమెను టెంప్ట్ చేసే ఆఫర్ తో వచ్చింది వివిడ్ ఎంటర్ టైన్మెంట్. ఈ సంస్థ ఇంతకుముందు మరో రియాల్టీ స్టార్ కిమ్ కర్దాషియాన్ తన బాయ్ ఫ్రెండ్ తో సెక్స్ చేసిన టేప్ రిలీజ్ చేసింది. ఆ వీడియో అప్పట్లో పెద్ద సంచలనం రేపింది. మరి కైలీ ఈ 65 కోట్ల ఆఫర్ కు ఒప్పుకుంటుందో లేదో చూడాలి. 

No comments: