Monday, August 24, 2015

మహేష్ పాటతో చైతన్య సినిమా టైటిల్

నాగ చైతన్య హీరోగా తమిళ దర్శకుడు గౌతం మీనన్  దర్శకత్వం లో రుపోతుతున్న సినిమా ఫస్ట్ లుక్ ఈ నెల 29 న అంటే అక్కినేని నాగార్జున పుట్టిన  విడుదల కానుంది. ఈ సినిమాను తమిళం లో కూడా రూపొందిస్తున్నాడు. తమిళం లో శింబు హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే తమిళ వెర్షన్ కు టైటిల్ ఓకే అయ్యింది. దానికి దగ్గరగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.  అయితే నాగ చైతన్య హీరోగా రూపొందే ఈ సినిమాకు టైటిల్ కోసం అన్వేషణలో పడ్డాడు దర్శకుడు గౌతం. ఇదివరకే పాటలోని పల్లవులతో చాలా సినిమాలకు టైటిల్స్ పెట్టిన విషయం తెలిసిందే. లేటెస్ట్ గా ఈ సినిమాకు మహేష్ ఒక్కడి సినిమాలోని సాహసం శ్వాసగా సాగిపో అనే టైటిల్ ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది.  మంజిమ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఎ అర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.  
sahasam swasaga sagipo - nagachytanya movie name

No comments: