Monday, March 19, 2012

ఫ్రెండ్స్‌ బుక్‌ గా మారిన ‘ఫేస్ బుక్’


ఫేస్‌బుక్‌’…ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చి..ఆధునిక పంథా స్నేహాలకు దారిచూపిన అద్భుత అంతర్జాల సాధనం. ఇదే పేరుతో ఆర్‌.పి.పట్నాయక్‌ దర్శకత్వంలో వెల్ఫేర్‌ క్రియేషన్స్‌ పతాకంపై డామళ్ల విజయప్రసాద్‌ సినిమా నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవలి టైటిల్‌ వివాదాల నేపథ్యంలో ఈ సినిమా పేరు మార్చారు. ‘ఫేస్‌బుక్‌’ కాస్త ‘ఫ్రెండ్స్‌ బుక్‌’ అయింది. హైదరాబాద్‌లో ఆర్‌.పి.పట్నాయక్‌ మాట్లాడుతూ ‘‘చట్టపరమైన ఏ ఇబ్బందులు రాకూడదనే ఈ నిర్ణయం. ‘ఫేస్‌బు్‌’ వారిని సంప్రదించినా..ఎలాంటి జవా బు లేకపోవడంతో టైటిల్‌ మార్చాం.
ఆరుగురు స్నేహితుల మధ్య సాగే కథ ఇది. నైజీరియన్‌ స్కామ్‌కి సంబంధించి ప్రత్యేక కామెడీ ట్రాక్‌ సందేశాత్మకంగా సినిమాలో చూపాం’’ అన్నారు. మళ్ల విజయప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం నిర్మాణానంతర పనులు నడుస్తున్నాయి. ఈ నెల 30న తెలుగు, తమిళ్‌(ముగ పుస్తకం)లో సినిమా రిలీజ్‌ చేస్తున్నాం. యువత మెచ్చే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ద్వితీయా ర్థంలో వచ్చే మలుపులు ఆకట్టుకుంటాయి’’ అన్నారు. త్వరలోనే ఈ సినిమా డిజిటల్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేయనున్నారు.

No comments: