Thursday, March 29, 2012

అమ్మడికి మరో పదేళ్ల తర్వాతే పెళ్లట!

సాధారణంగా ఏ కథానాయికనైనా ఏదో ఓ సందర్భంలో ఎవరో ఒకరు పెళ్లెప్పుడు? అనే ప్రశ్న అడుగుతూనే వుంటారు. అలానే ఇటీవల ఒకరు తమన్నా కెరియర్ గురించి ప్రస్తావిస్తూ, అదే ప్రశ్నఅడిగారు. అంతే... ఆమె కస్సుమంటూ అంతెత్తున లేచిందట. తర్వాత కాస్త కూల్ అయి, 'అప్పుడే నాకు పెళ్లి చేసి పంపించేయాలనుకుంటున్నారా?' అంటూ వయ్యారాలు పోయింది. ప్రస్తుతం తన వయసు 22 అనీ ... మరో 10 - 12 సంవత్సరాల వరకూ పెళ్లి గురించి ఆలోచించనంటూ చెప్పింది. ప్రస్తుతం తమన్నా సక్సెస్ గ్రాఫ్ కళ కళ లాడుతోంది కాబట్టి, మాధురీ దీక్షిత్ లానో ... ఐశ్వర్య రాయ్ లానో వంటి మీదకి 35 వచ్చాక పెళ్లి చేసుకోవచ్చులే అనేది ఆమె ఉద్దేశం కావచ్చని ఇండస్ట్రీలో అంతా అనుకుంటున్నారు.
        కెరియర్ పై ఆశలు పెట్టుకోవడం తమన్నా తప్పు కాకపోయినప్పటికీ, అలా మాట్లాడటం ఆమె అమాయకత్వమని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే బాలీవుడ్లో మాధురీ ... ఐశ్వర్యాలకి అలా కలిసొచ్చిందంతే. ఆ పొజీషన్ కి అందరూ చేరుకుంటారని చెప్పలేం. తమన్నా అయినా ఇంకెవరైనా చేతిలో ఓ నాలుగు సినిమాలు వుంటే చెప్పే కబుర్లు వేరు ... ఆ సంఖ్యా అలా అలా తగ్గగానే చెప్పే ముచ్చట్లు వేరు... అనే సంగతి అందరికీ తెలిసిందే. అందువల్ల పెళ్లనేది ఫైయిల్యూర్స్ లో ఉన్న హీరోయిన్లను అడిగే ప్రశ్నైపోయిందని విమర్శకులు అంటున్నారు.   




 










 
       

No comments: