Thursday, March 29, 2012

ఇబ్బందుల్లో పడనున్న చరణ్ సినిమా!


 
 
 

 
 


బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ నటించిన 'జంజీర్' చిత్రం రీమేక్ ద్వారా రాంచరణ్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రకాష్ మెహ్రా నిర్మాణంలో ... అపూర్వ లఖియా దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఏప్రిల్ నుంచి జరిపేందుకు ప్లాన్ చేశారు. అయితే షూటింగ్ కి ముందే ఈ సినిమాకి అడ్డంకులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 'జంజీర్' ఒరిజినల్ రచయితల కారణంగా ఈ సినిమా షూటింగ్ ప్రశ్నార్ధకంగా మారే పరిస్థితి వుంది.
       'జంజీర్' సినిమా రీమేక్ కి సంబంధించిన విషయంలో దర్శక నిర్మాతలు తమని సంప్రదించకపోవడం పట్ల రచయితలు సలీమ్ - జావేద్ తీవ్రమైన అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తమకి చాలా అసహనాన్ని కలిగించిందనీ ... కోర్టుకి వెళ్లేందుకు సిద్ధమౌతున్నామని వారు చెప్పినట్టు తెలుస్తోంది. భారీ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలని ఉబలాటపడుతోన్న చరణ్, కొత్తగా తలెత్తిన ఈ వివాదం పట్ల ఎలా స్పందిస్తాడో ... ఏమో ..!   






 

   

No comments: